నమస్తే శేరిలింగంపల్లి: దేశానికి యువత ఎంతో కీలకమని, యువత ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం, స్వామి వివేకానంద సంయుక్తంగా మాదాపూర్ లోని శిల్పారామం దగ్గర ఏర్పాటు చేసిన శిల్పారామం 2కె రన్ కార్యక్రమానికి జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు, స్వామి వివేకానంద గౌరవ అధ్యక్షుడు జ్ఞానేంద్ర ప్రసాద్, ఎన్ వై కె స్టేట్ డైరెక్టర్ అన్షుమాన్ దాస్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఆచారి మాట్లాడుతూ దేశానికి శారీరక దృఢత్వం కల్గిన యువత అవసరం అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు నిండిన తరుణంలో దేశం కోసం పోరాటం చేసిన వీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికి తెలువాలనే సదుద్దేశంతో అజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తీసుకచ్చారన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు. జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిత్య జీవితంలో వ్యాయామం తప్పని సరిగా అలవాటు చేసుకోవాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు లోనవకుండా వ్యాయామం వైపు దృష్టి పెడితే ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ వై కె జిల్లా అధికారి ఇజయ్య, కృష్ణారావు, ఎన్ ఎస్ ఎస్ జేఎన్టీయూ కో ఆర్డినేటర్ శోభారాణి, రెడ్ క్రాస్ సొసైటీ నర్సింహా రెడ్డి, గజ్జల ఫాండేషన్ వ్యవస్థాపకులు యోగనంద, పీఐబీ కృష్ణ , యువజన సంఘం నాయకులు హరికృష్ణ, బిజెపి నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, చింతకింది గోవర్ధన్ గౌడ్, నాగులు గౌడ్, బుచ్చి రెడ్డి, వివేక్, హరిప్రియ, నవీన్, మహేందర్, హరికృష్ణ, నాగులు గౌడ్, బుచ్చి రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, వివేక్, హరిప్రియ, నవీన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.