నమస్తే శేరిలింగంపల్లి: సీనియర్ సిటిజెన్స్ డే ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని దత్త సాయినగర్ గ్రేస్ వృద్దాశ్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజెన్స్ డే వేడుకలు నిర్వహించారు. కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో వయో వృద్ధుల సేవ ఎనలేనిదన్నారు. నేటి యువతి, యువకులు స్వార్ధ చింతనతో కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వృద్ధ, అనాథ ఆశ్రమాలలో చేర్పిస్తున్నారని అన్నారు. మానవీయ సంబంధాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమం లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కందుకూరి విజయానందు, కొవ్వూరి అశోక్ యాదవ్, విష్ణుప్రసాద్, పాలం శ్రీను, జనార్ధన్, కవి రచయిత భమిడిపాటి వెంకటేశ్వరరావు, కుర్రా అజిత, ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.