నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ గిడ్డంగి లోని పార్టీ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ దేశ రాజధాని హస్తినాపురంలో తెలంగాణ భవన్ కు స్థలం కేటాయించడం, శాశ్వత పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభసూచకమని అన్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం టిఆర్ఎస్ చరిత్రలో ఒక మర్చిపోలేని ఘటనగా అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో సురభి కాలనీ, పాపిరెడ్డినగర్, ఆర్ జి కె లో, ఆరంభ టౌన్షిప్, ఆదర్శ నగర్ రోడ్ నెంబర్ 2 లో, నెహ్రునగర్ కాలనీ లో, గోపీనగర్ ఎస్సీ సంఘం, గోపినగర్ యూత్, బాపు నగర్ హనుమాన్ యూత్, సుదర్శన్ నగర్ కాలనీ అసోసియేషన్, అంజయ్య నగర్ గచ్చిబౌలిలో,ఏ పీ హెచ్ బి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఫేస్-4 అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆవిష్కరించారు. మరిన్ని కాలనీలలో కార్పొరేటర్
ఆదేశానుసారం అక్కడి ముఖ్య నేతలు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, పార్టీ ముఖ్య నేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తల పాల్గొన్నారు.