హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో ఘనంగా జెండా పండగ – పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మన టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సగర్వంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేయడం యావత్తు తెలంగాణ ప్రజలు గర్విస్తున్నారని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ గ్రీన్ బావర్చి హోటల్ సమీపంలో స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, టిఆర్ఎస్ జెండా అన్ని వర్గాల ప్రజలందరికీ అండగా నిలుస్తోందన్నారు. టిఆర్ఎస్ జెండా పండుగను డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామంలో, ఓల్డ్ హఫీజ్ పేట్ లకలిప్స్కో హోటల్ ఆవరణలో, హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ‌బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటిమెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ జెండా పండగలో పాల్గొన్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here