నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ లోని ఎస్సీ బస్తి లో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఆర్ కె వై టీం సభ్యులు తాత్కాలికంగా పరిష్కరించారు. గురువారం ఆర్ కె వై టీం ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు. కాలనీలో ఉన్న ఒక్క బోరు కాస్త చెడిపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ దాహార్తిని తీరుస్తున్న ఆర్ కె వై టీం సభ్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.