నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట మహాశక్తి శ్రీ లలితా పోచమ్మ దేవాలయం లో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ వారి ఆశీస్సులు, అనుగ్రహాలతో ప్రజలందరు సుఖసంతోషాలతో గడపాలని అమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, విజయ హాస్పిటల్ ఏంండీ అల్లం పాండురంగారావు, టిఆర్ఎఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్ , నాయకులు ఉరిటీ వెంకట్రావు, దొంతి శేఖర్, అక్బర్ ఖాన్,గురు చరణ్ దుబే, అంజద్ పాషా ,దాస్, పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్, ఎల్లంనాయుడు, నరేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు..