నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని చందానాయక్ తండాలో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని కోరుతు ఆలిండియా బంజారా సేవా సంఘ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ఆద్వర్యంలో సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు వినతీ పత్రం అందజేశారు. చందానాయక్ తండా ఏర్పడి ఐదు దశాబ్ధాలు గడుస్తుందని, 5 వేల జనాభా కలిగిన ఈ తండాను నోటిఫైడ్ స్లమ్‌గా గుర్తించారని తెలిపారు. ఐతే ఇక్కడి ప్రజలకు కోవిడ్ పట్ల సరైన అవగాహన మహమ్మారికి ముగ్గురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తండా ప్రజలా ఆరోగ్య రక్షణ కోసం బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని కోరారు. నిరుపేద బంజారాలు చిన్నపాటి అనారోగ్యానికి చికిత్స పొందలేని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారని, వారి దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని బస్తీ దవాఖానాను కేటాయించాలని కోరారు. తమ విజ్ఞప్తిపై జడ్సీ రవికిరణ్ సానుకూలంగా స్పందించారని దశరథ్ నాయక్ తెలిపారు. వినతీపత్రం సమర్పించిన వారిలో సంఘం పెద్దలు రాములు నాయక్, మధుసూదన్ నాయక్ తదితరులు ఉన్నారు.