మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ బస్తీలో స్థానికులతో కలిసి శుక్రవారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేష్, ఛోటేమియా, దుర్గేష్, భుజంగం, భీమయ్య, దేవయ్య, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.