నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి బుదవారం ప్రజా సమస్యలపై బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలసి గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించిన గంగాధర్‌రెడ్డి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాలు, తాగునీరు, మురికి కాలువల సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించి కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో స్థానిక నాయకులు, మునిసిపల్ అధికారులు, బస్తి వాసులు పాల్గొన్నారు.






