
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులతో కలిసి పర్యటించారు. కాలనీలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్డు సరిగా లేక తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వాపోయారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. మంచినీటి పైపులైన్ కు మెయిన్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదని కనెక్షన్ ఇప్పించేలా చూడాలని స్థానికులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను కోరారు. ప్రశాంత్ నగర్ లో యూజీడీ పైపులైన్ పనులు పూర్తయ్యాయని త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి మంచినీటి పైపులైన్ కనెక్షన్ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట బద్దం కొండల్ రెడ్డి, కాలనీ వాసులు దాసోజు శ్రీనివాస్, నర్సింహా రెడ్డి, యాదయ్య ముదిరాజ్, సత్యనారాయణ, గౌస్ పాషా, శ్రీనివాస్, ప్రసాద్ రావు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.






