చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎండి.అహ్మద్పాషాకు సేవారత్న అవార్డు లభించింది. ఈ మేరకు హ్యూమన్‌రైట్స్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య, తెలంగాణ డీజీ గోపినాథ్రెడ్డిల చేతుల మీదుగా అహ్మద్‌పాషా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అహ్మద్‌పాషా మాట్లాడుతూ తనకు ఈ అవార్డు లభించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అవార్డు అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.






