సంక్షేమానికి పెద్దపీట వేసిన తెలంగాణ బడ్జెట్: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసేలా రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించిందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశంతో అన్ని రంగాలకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ రూపకల్పన చేయడం అభినందనీయమని తెలిపారు. అత్యంత  క్లిష్టమైన  పరిస్థితుల్లో సైతం 2.3 లక్షల కోట్ల  వ్యయాన్ని బడ్జెట్ లో  ప్రతిపాదించడం  కేసీఆర్ కే సాధ్యమని తెలిపారు.

ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ

పురపాలక  పట్టణాభివృద్ధి   కోసం 15 వేల కోట్లు, గృహ  నిర్మాణానికి 15 వేల కోట్లు , మెట్రో రైల్  కు 1000 కోట్లు, ఆర్టీసీ రంగానికి  ౩ వేల కోట్లు కేటాయించడం ప్రజలకు  మౌలిక  సదుపాయాల కల్పనకు దోహదం చేస్తాయన్నారు. వైద్య  రంగానికి  6295 కోట్లు, పాఠశాల  విద్యకు 11 ,735 కోట్లు, ఉన్నత  విద్య  రంగానికి  1873 కోట్లు , బి సి సంక్షేమానికి  5 ,522 కోట్లు, ఎస్ సి ,ఎస్ టి లకు ప్రత్యేక ప్రగతినిధితో పాటు కల్యాణ లక్ష్మి  , షాదీ  ముబారక్ కు  పెద్ద  ఎత్తున  నిధులు  కేటాయించి అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారు. సమాజంలో  అట్టడుగున  ఉన్న వ్యక్తి వరకు  ప్రగతి  ఫలాలను  అందించాలనే ఉద్దేశంతో, అన్ని వర్గాల సంక్షేమం కోసం బంగారు  తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఆమోఘమని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here