నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రతీ బస్తీ, కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ది పరిచి డివిజన్ సమగ్ర అభివృద్దికి కృషి చేస్తానని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో ఆయన స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా చేపట్టాల్సిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మంచినీటి పైప్ లైన్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దామోదర్ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, మల్లేష్, వెంకటేశ్వర రావు, వేణు గోపాల, రఘువీర, కృష్ణ, రాజ్ ధర్మ రెడ్డి, శ్రీధర్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.