నమస్తే శేరిలింగంపల్లి: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తమ సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్టు కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రహీమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు అనేక సౌకర్యాలు కల్పించి, క్రమబద్ధీకరణ కోసం 16 జీవో ని విడుదల చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. అదేవిధంగా బేసిక్ పే, ఒక్క రోజు బ్రేక్ లేకుండా 12 నెలల వేతనము కల్పించడంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాత్ర కీలకమని అన్నారు. ఈ క్రమంలోనే మైనారిటీ లెక్చరర్ లు, మరియు మైనారిటీ మిత్రులు అందరూ మొదటి ప్రాదాన్యత ఓటు పల్లాకే వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అన్సారీ, మిన్హాజ్ ఉల్ హక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల మైనారిటీ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.