నమస్తే శేరిలింగంపల్లి: నవభారత్‌నగర్ బస్తీ వాసులను మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ పి.రవీంద్రప్రసాద్ అభినందించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నవభారత్‌నగర్ బస్తీలో స్థానికులు స్వంత నిధులతో 8 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ గురువారం బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలతో దొంగతనాలను నియంత్రించవచ్చని, వాటి పట్ల ఎంత అవగాహన కల్పించినా కొన్నిచోట్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని అన్నారు. కాగా నవభారత్‌నగర్ బస్తీ వాసులు స్వంత నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, ఇతర బస్తీలు, కాలనీలను, గేటెడ్ కమ్యూనిటీలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బస్తీలోని సీసీ కెమెరాలను జీయో ట్యగింగ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ ఎస్ఐ భాస్కర్, బస్తీ పెద్దలు పాల్గొన్నారు.