చందానగర్, నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ సముదాయంలో శనివారం మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భవాని అమ్మ వారి సుప్రభాత సేవ, విశేష అర్చన, విశేష పుష్పాలంకరణ, లక్ష కుంకుమార్చన, బాలబోగం నివేదనలతో పాటు ముఖ్యంగా విశేష పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి ఆచార్యులు, అమ్మవారి ఆలయ అర్చకులు రవి శర్మల పర్యవేక్షణలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, పరిసరప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ భవాణి శంకరస్వామి ఆశీస్సులు పొందారు.






