హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): మలబార్ గ్రూప్‌కు చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ వినియోగదారుల కోసం నాణ్యమైన గోల్డ్ బార్స్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఎవరైనా సరే అత్యంత పారదర్శకమైన పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ధ్రువీకరించబడిన, అత్యంత నాణ్యమైన లండన్ గుడ్ డెలివరీ గోల్డ్ బార్స్ (ఎల్జీడీబీ), దుబాయ్ గుడ్ డెలివరీ గోల్డ్ బార్స్ (డీజీడీబీ), బీఐఎస్ హాల్ మార్క్ బంగారు కడ్డీలను 100 గ్రాములు, 1000 గ్రాముల పరిమాణాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునేవారు మలబార్ గోల్డ్ బులియన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని బంగారం ధరల హెచ్చు తగ్గులను గమనించవచ్చు. బంగారు కడ్డీల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కేవైసీ నిబంధనలను పూర్తి చేసిన తరువాత కొనుగోలుదారుడు తమకు అవసరమైన మొత్తంలో బంగారాన్ని బుక్ చేసుకుని ఆర్టీజీఎస్ పద్ధతిలో చెల్లించవచ్చు. కొనుగోలుదారుడు చిరునామాకు కొరియర్ ద్వారా సాధ్యమైనంత త్వరగా బంగారు కడ్డీలు పంపించబడతాయి. వీటికి బీమా సదుపాయం కూడా ఉంటుంది. దేశంలో కొనుగోలుదారులు ఎక్కడి నుంచైనా బంగారం బుక్ చేసేందుకు తమ ఫోన్ నంబర్ 9961174999 (ఎక్స్టెన్షన్స్ 4272, 4291) లో సంప్రదించవచ్చని తెలిపారు.