మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్‌లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ బుధవారం మాదాపూర్ ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో ఏఈ సాయి తేజకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానికంగా రెండు ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలని, ఎలక్ట్రిక్ స్తంభాలను మార్చి నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని, కేబుల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవభారత్ నగర్ బస్తీ నాయకులు నూరుద్దీన్, షేక్ అలీ, అమీర్, యాదగిరి, నాగు ముదిరాజ్ పాల్గొన్నారు.