గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని నానకరామ్ గూడ సాయి గణేష్ నగర్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ ఫన్నీ రాజా కుమారి రామ మందిర నిర్మాణం కోసం రూ.5వేల నిధిని అందజేశారు. అలాగే స్థానికంగా ఉన్న డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరడంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, కాలనీవాసులు పాల్గొన్నారు.