అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తికి హోప్ ఫౌండేష‌న్ స‌హాయం

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ స‌హాయం కోసం ఎదురు చూస్తున్న ఓ వ్య‌క్తికి హోప్ ఫౌండేష‌న్ అండ‌గా నిలిచింది. లింగంప‌ల్లికి చెందిన అజ్జు అనే వ్య‌క్తి గ‌త కొద్ది రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ హాస్పిట‌ల్‌లో చికిత్స కోసం అయ్యే ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు దాత‌ల కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా ఆ విష‌యం తెలుసుకున్న హోప్ ఫౌండేషన్ చైర్మ‌న్ కొండా విజయ్ కుమార్ శుక్ర‌వారం అత‌నికి రూ.10వేల ఆర్థిక స‌హాయం అంద‌జేశారు. పేద‌ల‌కు ఎల్ల‌ప్పుడూ త‌మ ఫౌండేష‌న్ స‌హాయం అందిస్తుంద‌ని కొండా విజ‌య్ కుమార్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

బాధితుడికి రూ.10వేలు అందజేస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మ‌న్ కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here