హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): స్వచ్ఛ ‘తెలంగాణ దినపత్రిక’ 2021 క్యాలెండర్ ను పత్రిక సీఎండీ ఉప్పరి శేఖర్ సగరతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ పత్రికా రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని చిన్న పత్రికలు ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.