చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష ఎన్ క్లేవ్ లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పబ్బ మల్లేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనాథ ఆశ్రమంలోని చిన్నారులకు, వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. జన్మదిన వేడుకల నేపథ్యంలో హంగులు, ఆర్భాటాలకు పోకుండా టిఆర్ఎస్ నాయకుడు పబ్బ మల్లేష్ అనాథలకు చేయుత ఇవ్వడం అభినందనీయమని చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేద ప్రజలకు అండగా ఉండాలన్నారు. అనంతరం పబ్బ మల్లేష్ మాట్లాడుతూ పేదవారికి సహాయపడాలని, వారికి తాము తోడుగా ఉన్నాం అని భరోసా ఇవ్వడానికే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు గురుచరణ్ దూబే, ఒ.వేంకటేష్, రవీందర్ రెడ్డి, నాగరాజు, కే నర్సింహ రెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, శ్రీనివాస్, బాబు, అనిల్ పాల్గొన్నారు.