నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ-2020 వల్ల సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ లోని సుమారు 10,400 పోలీస్ సిబ్బందికి జూన్ నెల ఏరియర్స్ తో పాటు, జూలై నెలకు సంబంధించి నూతన వేతనాన్ని అందిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ లకు సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘము ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి పుప్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ–2020 జీత భత్యాలను సిబ్బందికి అందజేయాలని రాచకొండ, సైబరాబాద్ సీపీల ఆదేశాలతో సైబరాబాద్ డీసీపీ అనసూయ, రాచకొండ డీసీపీ శిల్పవల్లి పర్యవేక్షణలో గతకొద్ది రోజుల నుండి రాచకొండ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సుగుణ, సైబరాబాద్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, సైబరాబాద్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ధర్మరాజ్, రాచకొండ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, సైబరాబాద్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మధులత, రాచకొండ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనిల్ నిరంతరం శ్రమించారన్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీసు వారికి సకాలములో పిఆర్‌సి 2020 ఫలాలు మంజూరు చేసినందుకు సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు.
