కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, డీఎస్ఓ మనోహర్ కుమార్ రాథోడ్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికి ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తుందన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లో నూతనంగా సుమారు1200 రేషన్ కార్డుల వరకు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, వీఆర్ఓ శంకరయ్య, డీలర్లు కొండల్ రెడ్డి, యాదా గౌడ్, మల్లికార్జున్ యాదవ్, అశోక్, కిషోర్, వార్డు మెంబర్ శ్రీకళ, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నాయకులు పట్లోళ్ల నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లు, యోగి, బృంగి సుమన్, ఎండీ అలీమ్, సౌజన్య, భాగ్యలక్ష్మి, సుధారాణి, కళ్యాణి, రోజారాణి తదితరులు పాల్గొన్నారు.

లబ్దిదారులకు‌ కొత్త రేషన్‌ కార్డులను అందజేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here