నమస్తే శేరిలింగంపల్లి: పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం బాచుపల్లి తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ఎమ్మార్వొకు వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమానికి హాజరైన ఎంసిపిఐయు రాష్ట్ర నాయకులు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఓ పక్క ప్రజలు కరోనాతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకులు, డిజిల్ పేట్రోల్ ధరలను పెంచి సామాన్యుడిపై మరింత భారాన్ని పెంచాయన్నారు. దేశ ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్పొరేటీకరణ విధానాల్లో భాగంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలనీ లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందోళన కార్యక్రమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లో సిపిఎం నాయకులు చంద్రశేఖర్ ,సి పి ఐ, కెవిపి యస్, సి ఐ టి యు, ఏ ఐ సి టి యు నాయకులు పాల్గొన్నారు.