కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ప‌థ‌కాల‌తో ఎంతో మందికి ల‌బ్ధి:  ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ 

పేద‌ల‌ను ఆదుకునేందుకు తెరాస ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటుంద‌ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ అన్నారు. సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ల‌బ్ధిదారుల‌కు ఆయ‌న 150 చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పేదింటి ఆడ పిల్ల‌ల పెళ్లి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ రెండు ప‌థ‌కాలు ఎంతో మందికి ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని అన్నారు. సీఎం కేసీఆర్ పేద‌ల కుటుంబాల‌ను పెద్ద‌న్న‌లా ఆదుకుంటున్నార‌ని తెలిపారు.
ల‌బ్ధిదారుల‌కు చెక్కుల‌ను అంద‌జేస్తున్న ఎమ్మెల్యే గాంధీ
ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, ఆర్ఐలు చంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, అటెండర్లు బాలరాజు, సత్యనారాయణ, మియాపూర్ డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అద్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు పొడుగు రాంబాబు, చింత కింది రవీందర్, ప్రతాప్ రెడ్డి, సుధాకర్, మియాన్ పటేల్, కాజా, ఉమా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here