కొండాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లో తలెత్తిన డ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను మరియు స్మశాన వాటిక ను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసులు విజ్ఞప్తి మేరకు కాలనీ లో నెలకొన్న డ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను మరియు స్మశాన వాటిక ను పరిశీలించడం జరిగిందని సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అవుట్ లెట్ ఏర్పాటు సాధ్య సాధ్యాలను పరిశీలించి త్వరిత గతిన పనులు పూర్తి చేసి
ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని,ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించేలా చూడలని . కాలనీలో ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికివచ్చిన పరిష్కరిస్తానని ,ప్రజలకు ఎల్లా వేళల అందుబాటులో ఉంటానని ,కాలనీల అభివృద్ధికి,డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయషెక్తుల కృషి చేస్తానని తెలిపారు . ఈ కార్యక్రమంలో అధికారులు DE రమేష్ , AE శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ వార్డ్ మెంబెర్ నర్సింహా సాగర్ ,గౌరీ ,తెరాస నాయకులు నందు , ఇనాయత్, అనేర్ తదితరులు పాల్గొన్నారు