శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని FCI కాలనీలో తలెత్తిన డ్రైనేజ్ సమస్యను జలమండలి DGM నారాయణ, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎఫ్సిఐ, వీడియో కాలనీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, పొంగుతున్న మ్యాన్ హోల్ ల వద్ద పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సుప్రజ, ఉమాకిషన్, జితేందర్, వర్క్ ఇన్స్పెక్టర్లు కనకరాజు , లింగయ్య, నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






