ఘ‌నంగా బోయిన్‌ప‌ల్లి వినోద్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు – శుభాకాంక్ష‌లు తెలిపిన గుండె గ‌ణేష్ ముదిరాజ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి సీనియ‌ర్ నాయ‌కుడు బోయిన్‌ప‌ల్లి వినోద్‌రావు జ‌న్మ‌దిన వేడుకలు సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. మియాపూర్ డివిజ‌న్, మ‌క్తా మ‌హబూబ్‌పేట్ బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు గుండె గ‌ణేష్ ముదిరాజ్ మ‌దీన‌గూడ‌లోని వారి నివాసంలో వినోద్‌రావును క‌లిసి ఘ‌నంగా స‌న్మానించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా గ‌ణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి ముద్దు బిడ్డ, దశాబ్ధపుకాలం నుండి మచ్చలేని నాయకుడిగా కార్యకర్తలు కష్టాల్లో అండ‌గా నిలిచే నాయకుడు వినోద్ రావు అని కొనియాడారు. వారు ఆయువు ఆరోగ్య ఐశ్వ‌ర్యాల‌తో నిండు నూరేళ్లు జీవించాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు జాజిరావు, శ్రీను, జాజిరావు రాము, గేదెల శివ, దుర్గష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

వినోద్‌రావుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న గుండె గ‌ణేష్ ముదిరాజ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here