నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత వెంకటేశ్వరాల సముదాయంలో గత ఐదు రోజులుగా కొనసాగుతన్న శ్రీవారి 26వ బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి నిత్యోపాసనం, మహాశాంతి హోమం, పూర్ణహుతి, ధ్వజ అవరోహణం, అన్నసమారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీ చక్ర స్నానం వైభవంగా జరిగింది. భక్తులు ఉత్సాహంగా చక్రస్నానంలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతకు ముందు స్వామివారి శేష వస్త్రాలు వేలం పాట వేశారు. సాయంత్రం రధోత్సవం కన్నుల పండువగా జరిగింది. పద్మావతి గోధాదేవి సమేతుడై శ్రీ వేంకటేశ్వర స్వామి చందానగర్ పురవీధుల్లో ఊరేగారు. స్థానిక భక్తులు ఘనంగా స్వాగతం పలికి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రధానార్చకురలు, విశాఖ శ్రీ శారదా పీఠం తెలంగాణ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యుల పర్యవేక్షణలో కొనసాగిన ప్రత్యేక పూజల్లో బ్రహ్మోత్సవాల ధీక్షా భక్తులు, ఉప కార్యదర్శి కైలా దేవేందర్ రెడ్డి భార్గవి దంపతులు, కొనసాగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కె. రఘుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి తూడి సుభాష్, ఉపాధ్యక్షులు తోట సుబ్బారాయుడు, పి.అశోక్‌గౌడ్, ఉపకార్యదర్శి కె.దేవేందర్ రెడ్డి, సభ్యులు వెంకట శేషయ్య, నాగేశ్వర్‌రావు, బ్రహ్మయ్య గుప్త, రాంగోపాల్, బచ్చు శ్రీకాంత్, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.