తెలంగాణా విమోచన అమృత మహోత్సవాలు అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామం: సామ రంగారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా , తెలంగాణా విమోచన అమృత మహోత్సవాల ప్రారంభోత్సవం కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ అధ్వర్యంలో శేరిలింగంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డితో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్ నుండి మియాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మియాపూర్ చౌరస్తా లో వీర వనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు . అనంతరం రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ను మతోన్మాద రాజ్యాంగం గా మార్చాలనుకున్న ఖాసీం రిజ్వి నేతృత్వం లో రజాకార్లు ప్రజలపై అమానుష దాడులు, అత్యాచారాలు , దురాగతాలకు తెగ బడ్డారని దీనితో ప్రజలు నిజాం పై, రజాకార్లపై వీరోచిత పోరాటం చేసి తిరుగుబాటు చేశారని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణా కు స్వాతంత్రం వచ్చిందని తెలంగాణకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భం గా తెలంగాణా విమోచన అమృత మహోత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామం పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ మాట్లాడుతూ 15 ఆగస్ట్ 1947న భారతదేశానికి స్వాతంత్రం రావడంతో దేశం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ సంబరాలు జరుపకుంటుంటే నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన ప్రస్తుత తెలంగాణా మాత్రం ఆ సమయంలో స్వాతంత్రానికి నోచుకోలేదని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన “పోలీస్ చర్య” ఫలితంగా 17 సెప్టెంబర్ 1948న నిజాం భారత సైన్యానికి లొంగిపోవడం ద్వారా ఆనాటి హైదరాబాద్ నిజాం పిడికిలి నుండి విముక్తి చెంది, భారతదేశంలో కలిసింది అని భారత స్వాతంత్రం పోరాట చరిత్రలో హైదరాబాద్ విముక్తి పోరాటం అపురూప మైన ఘట్టం అని అన్నారు. 17న పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే తెలంగాణా విమోచన అమృత మహోత్సవాలలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, ఎం .సత్యనారాయణ, ప్రభాకర్ యాదవ్, బీజేపి సీనియర్ నాయకులు పొరెడ్డి బుచ్చిరెడ్డి , బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, చందా నగర్ మాజీ కార్పొరేటర్ బొ బ్బా నవతా రెడ్డి, బీజేపి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, బీజేపి జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్, బీజేపి డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు , రాజు శెట్టి, గొల్లపల్లి రాంరెడ్డి, శ్రీధర్ రావు, బీజేపి కాంటెస్ట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, జిల్లా OBC మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, యస్ టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజేందర్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంగయ్య యాదవ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కుమార్ , బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అమర్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు శివ కుమార్, ఆనంద్ కుమార్, మల్లేష్ గౌడ్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మియాపూర్ చౌరస్తా లో వీర వనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బిజెపి నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here