నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. తారా నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ వల్ల తరుచుగా సమస్య తలెత్తుతుందని, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డు మెంబర్ కవిత, మాజీ కౌన్సిలర్ లక్ష్మి నారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, నర్సిహ్మారెడ్డి, రమేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.