స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో వివేకానంద‌నగ‌ర్ డివిజ‌న్‌లో విశ్వ జాగృతి దివస్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: స్వ‌దేశీ జాగ‌ర‌ణ మంచ్ ఆద్వ‌ర్యంలో ఆదివారం వివేకానంద న‌గ‌ర్ డివిజ‌న్‌లో విశ్వ జాగృతి దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మూసాపేట్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ కొడిచెర్ల మ‌హెందర్‌, మెడ్చెల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా బిజెపి మ‌హిళ మోర్చ కార్య‌ద‌ర్శి విద్య క‌ల్ప‌న ఏకాంత్‌గౌడ్‌, స్వ‌దేశీ జాగ‌ర‌ణ మంచ్ రాష్ట్ర కో క‌న్వీన‌ర్ సిద్దుల అశోక్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కరొన మహమ్మారిని అరికట్టాలంటే పేటెంట్ లేని వ్యాక్సినేషన్ తయారీ కావాలన్నా భారత ప్రధాని నరేంద్ర మోడీకి విశ్వ జాగృతి దివస్ రోజున సంపూర్ణ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తు్న్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పేటెంట్ వ్యాక్సినేషన్ తయారీ వలన సుమారు నెలకు పది కోట్ల డోసులు మాత్రమే తయారు చేయగలుగు తున్నారని ప్రపంచంలోని సుమారు 750 కోట్ల జనాభాకు వ్యాక్సినేషన్ అందించాలంటే 5, 6 సంవత్సరాల కాలం పడుతుంద‌ని గుర్తుచేశారు. ఈ క్ర‌మంలోనే కరోనా వ్యాక్సిన్ మిషన్ తయారీని ఇతర కంపెనీలతో (పేటెంట్ లేని) తయారు చేయించాలని అన్నారు. పేద ధనిక కుల మతాలకతీతంగా ప్ర‌జ‌లంద‌రికి ఉచితంగా వ్యాక్సినేషన్ త్వరగా అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ కూక‌ట్‌ప‌ల్లి కన్వీనర్ స్వామి యోగేష్ ప్రభు, ప్ర‌తినిధులు మణిభూషణ్, రఘు తదితరులు పాల్గొన్నారు.

స్వ‌దేశీ జాగ‌ర‌ణ మంచ్ ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తున్న కొడిచెర్ల మ‌హెందర్‌, విద్య క‌ల్ప‌న ఏకాంత్‌గౌడ్‌, సిద్దుల అశోక్‌, యోగీష్ ప్ర‌భు త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here