శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా సుంకరి విజయ్ నియమితులయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుంకరి విజయ్ ని చందానగర్ ఇన్ స్పెక్టర్ గా బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పాలవెల్లి సైబరాబాద్ క్రైమ్స్ విభాగానికి బదిలీ అయ్యారు. కాగా సుంకరి విజయ్ గురువారం సాయంత్రం పాలవెల్లి నుంచి చార్జ్ తీసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులు పాలవెల్లికి వీడ్కోలు, విజయ్ కి స్వాగతం పలికారు.