వీరేశ్ సగర కుటుంబానికి న్యాయం చేయాలి – మంత్రి నిరంజన్ రెడ్డికి రాష్ట్ర సగర సంఘం విజ్ఞప్తి

నమస్తే ‌శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గాయపడి రెండు చేతులు కోల్పోయి జీవిస్తున్న గద్వాల జిల్లా మాల్ దొడ్డి గ్రామవాసి పేద కుటుంబానికి చెందిన వీరేశ్ సగరకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సగర సంఘం నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఇప్పటివరకు ఆస్పత్రిలో ఖర్చుపెట్టుకున్న దాదాపు రూ.11 లక్షలు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పిస్తానని, కృత్రిమ అవయవాలు (చేతులు) పెట్టించేందుకు ఎంత ఖర్చు అయినా ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డికి సంఘం రాష్ట్ర నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, బాధితుడు వీరేశ్ సగర, వారి కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, వనపర్తి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి సందుపట్ల రాము సగర, వనపర్తి జిల్లా సంఘం నాయకలు విష్ణు సగర, మురళీ సగర, రాధాకృష్ణ సగర, నాయకులు శేఖర్ సగర, నారాయణ సగర తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here