శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, జిహెచ్ఏంసీ అధికారులు,స్థానిక నాయకులతో కలసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం గావించారు.