నమస్తే శేరిలింగంపల్లి: కులమతాలకు అతీతంగా రంజాన్ పండగను జరుపుకుని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని పీసీసీ రాష్ట్ర నాయకులు సమీర్ కౌషల్ ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పీసీసీ రాష్ట్ర నాయకుడు సమీర్ కౌషల్ పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో
పవిత్రమైందన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండగను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగం శ్రీనివాస్ యాదవ్, యూసఫ్ ఖాన్, అక్బర్ ఖాన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.