శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి తారనగర్ లో మంగళవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డివిజన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ డివిజన్ల వారిగా ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం, డివిజన్ల వారీగా నిర్ణయించిన చెరువులు, నిమజ్జనం స్థలాలలో పర్యటించాలన్నారు. డివిజన్ వారిగా ముఖ్యమైన వినాయక మండపాల లిస్ట్ సేకరించి సంబంధిత అధికారులను కలిసి వసతులపై మాట్లాడి వివరాలు తెలుసుకోవాలన్నారు. వినాయక నిమజ్జననానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో భాగ్యనగర్ గణేష్ సమితి సభ్యులు పనిచేయాలని అన్నారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ముఖ్య సలహాదారుడు బాల్ద అశోక్, ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచనలతో కరపత్రం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీ కో కన్వీనర్ మణిభూషణ్, నాయకులు మహిపాల్ రెడ్డి, డివిజన్ కన్వీనర్లు శాంతి భూషణ్ రెడ్డి, రవి గౌడ్, శ్రీశైలం కురుమ, టి.రఘు, సాయి రామ్ గౌడ్, రాజేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి, శ్రీధర్ రావు, కమలాకర్ రెడ్డి, ఆంజనేయులు, భూపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, కైతాపురం జితేందర్, లక్ష్మణ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, విజేందర్ సింగ్, సాయి కుమార్, చంద్రమౌళి గౌడ్, మున్నూరు సాయి పాల్గొన్నారు.