- జర్నలిస్టుపై దాడిని ఖండించిన నల్లా సంజీవ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యాయ విభాగం శేరిలింగంపల్లి మండల అధ్యక్షునిగా బజార్‌ఘట్ రమేష్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి నియామకపు పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేందర్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యాయ విభాగం కృషి చేయనున్నట్లు తెలిపారు. మండల అధ్యక్షునిగా నియామకమైన రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన జాతీయ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. సత్యం, ఎం. ప్రకాష్, సురేందర్ రెడ్డి, సందీప్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి మత్తులో జర్నలిస్టుపై దాడి హేయమైన చర్య అని హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ జాతీయ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి, రాష్ట్ర న్యాయ విభాగం అధ్యక్షుడు కనకమామిడి సురేందర్ గౌడ్, శేరిలింగంపల్లి మండలం నూతన అధ్యక్షుడు బజార్‌ఘాట్ రమేష్ తీవ్రంగా ఖండించారు. శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న జర్నలిస్టు ఎల్లేష్ పై గంజాయి మత్తులో ఉన్న యువత దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు. గంజాయి నివారణపై పోలీసులు దృష్టి సారించాలన్నారు.