నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ లో హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ మెజీషియన్ రాజు తన సత్తా చాటారు. తన మ్యాజిక్ షో తో అందరిని ఔరా అనిపించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి కి చెందిన ప్రముఖ మెజీషియన్ బీఎల్ఎన్ రాజు ఈ నెల 8,9,10 తేదీల్లో శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. రాజు ప్రదర్శించిన గాలా మ్యాజిక్ షో అందరిని ఆకట్టుకుంది. వాటర్ జగ్ నుంచి ఫ్లవర్స్ సృష్టించడం, వాటర్ క్యాన్ నుంచి మన దేశం జాతీయ పతాకం ప్రదర్శించడం, తదితర ఆసక్తికనబర్చే మ్యాజిక్ షో తో అందరిని ఆశ్చర్యపరిచారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అందరి మన్ననలు పొందిన మెజీషియన్ బీ ఎల్ ఎన్ రాజు ను శ్రీలంక మ్యాజిక్ సొసైటీ అధ్యక్షుడు లక్వారాన్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మెజీషియన్ రాజు మాట్లాడుతూ అంతర్జాతీయ మేజిక్ ఫెస్టివల్లో గాలా షో ద్వారా మ్యాజిక్ ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ కు చాలా దేశాల నుంచి అనేక మంది అంతర్జాతీయ మేజిక్ కళాకారులు విచ్చేశారన్నారు.