డయాబెటిస్ పట్ల అప్రమత్తత అవసరం – ఎపిక్ స్మైల్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అధినేత డాక్టర్ సోమిశెట్టి విజయభాస్కర్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలి, సమయపాలన లేని ఆహారపు అలవాట్లతో డయాబెటిస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఎపిక్ స్మైల్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అధినేత డాక్టర్ సోమిశెట్టి విజయభాస్కర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీలోని పటేల్‌కుంట పార్క్ సమీపంలో గల ఎపిక్ స్మైల్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ ఎవరెస్ట్ అధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిక్ స్మైల్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అధినేత, లయన్స్ క్లబ్‌ క్రియాశీలక మెంబర్ డాక్టర్ సోమిశెట్టి విజయభాస్కర్ మాట్లాడారు. భారతదేశంలో డయాబెటిస్ వ్యాధి ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటూ ఇతర వ్యాధులు వచ్చేందుకు కారణమవుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఈ వ్యాధిపట్ల మరింత అవగాహన కల్పించి, అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, డయాబెటిస్‌ని అదుపు చేస్తే అన్ని విధాలా రక్షణ కలుగుతుందని సూచించారు. మధుమేహం వల్ల శరీరంలోని ఇతర భాగాలు కూడా బలహీనపడి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారు రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. అలాగే దంత వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరగటం, సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించడం మంచిదని అన్నారు. అనంతరం దంత సమస్యలున్నవారికి ఉచిత దంత వైద్య కన్సల్టేషన్ కూపన్లు అందజేశారు. ఈ క్యాంపులో సుమారు 112 మంది హాజరై చికిత్సలు చేయించుకున్నారు. ఈ క్యాంప్‌లో ప్రెసిడెంట్ లయన్ శ్రీనివాస్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ డయాబెటిక్ డాక్టర్ జీకే రమణ, సెక్రెటరీ డాక్టర్ సింహరాజు, లయన్ వేణుగోపాల్, లయన్ డాక్టర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎవరెస్ట్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న విజయ భాస్కర్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here