నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేయించడంతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరమని, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదన్నారు. కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, ఆయా డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రాజు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, దామోదర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.