నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు కొండాపూర్ డివిజన్ లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో ప్రతీ బస్తీలో గులాబీ తోరణాలతో అలంకరణ చేసి ప్రధాన కూడళ్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, బస్తీ కమిటీ నాయకులు, మహిళ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని టీఆరెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, కొత్తగూడ జంక్షన్, గోపాలరెడ్డి నగర్, మార్తాండ్ నగర్, ప్రేమ్ నగర్ ఏ, బి బ్లాకులు, రాజ రాజేశ్వరి కాలనీ, అంజయ్య నగర్, సిద్దిఖ్ నగర్, బంజారా నగర్, పీజేఆర్ నగర్, మస్తాన్ నగర్ లలో కార్పొరేటర్ హమీద్ పటేల్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుపోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నీళ్లు, నిధులు, నియమకాలు అనే నినాదంతో కేసీఆర్ ప్రాణాలకు తెగించి, స్వరాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు పరిచి, వాటి ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, రూపారెడ్డి, జంగం గౌడ్, శ్రీనివాస్ చౌదరి, రవి శంకర్ నాయక్, తిరుపతి యాదవ్, ఎర్రరాజు, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, తాడెం మహేందర్, సాయి శామ్యూల్ కుమార్, కచ్చావా దీపక్, కరీం, నాగేశ్వరావు, రజనీకాంత్, తిరుపతి, లక్ష్మి, మొహ్మద్ అలీ, షబ్బీర్, కలీం, ఉప్పు శ్రీనివాస్, కాశెట్టి అంజి, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, కేశం కుమార్ ముదిరాజ్, నీలం లక్ష్మినారాయణ ముదిరాజ్, స్వామి సాగర్, ఖాసీం, అంజాద్, సయ్యద్ ఉస్మాన్, హిమామ్, జలీల్ ఖాన్, డా. రమేష్, గిరిగౌడ్, యాదగిరి, సత్తిబాబు, శ్యామల, అబేద్ అలీ, సమద్, మధు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, సీహెచ్ శ్రీనివాస్ గౌడ్, పి. రామకృష్ణ, సిద్దిఖ్ నగర్ ప్రెసిడెంట్ బసవరాజు, నందు, సాగర్ చౌదరి, బుడుగు తిరుపతి రెడ్డి, ఉప్పులూరి ఆనంద్ చౌదరి, సదర్ సాయి కుమార్, గణపతి, చారీ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.