నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోందని, పేదలకు ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేందుకు అధునాతన వైద్య చికిత్స అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి లో 120 బెడ్లతో నూతనంగా నిర్మించిన ఫ్లోర్ ను బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించేందుకు, రోగులకు బెడ్స్ కొరత లేకుండా 120 బెడ్లతో అత్యాధునిక హంగులతో వైద్య చికిత్సలు అందించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, కార్పొరేటర్లు హమీద్ పటెల్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, వైద్య అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.