నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లోని రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగా టీఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ గాంధీ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు వేసవి తాపానికి మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి చలివేంద్రం ద్వారా దాహార్తిని తీర్చవచ్చన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని పేర్కొన్నారు. ఈ మేరకు చలి వేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులు చంద్రమౌళిని ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేందర్, ఎల్లేష్, రామస్వామి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.