చందాన‌గ‌ర్‌లో ఘ‌నంగా రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు… శానిటైజేష‌న్ డ్రైవ్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయ‌కులు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఏఐసీసీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ నాయ‌కులు సేవా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అల్లావుద్దీన్ సౌజ‌న్యంతో శేరిలింగంప‌ల్లిలోని మురికివాడ‌ల‌లో శానిటైజేష‌న్ డ్రైవ్ చేప‌ట్టన్నున్నారు. శ‌నివారం చందాన‌గ‌ర్ గాంధీ విగ్రహం వ‌ద్ద‌ డీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సందీప్‌రెడ్డి శానిటైజేష‌న్ డ్రైవ్‌ను ప్రారంభించి స్వ‌యంగా క‌రోనా క్రిమి సంహార‌క మందును పిచికారి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన వేళ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులుగా తోచిన‌ సేవ కార్య‌క్ర‌మానికి పూనుకున్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రంగారెడ్డి జిల్లా మైనారిటీ వైస్ చైర్మ‌న్ అయాజ్ ఖాన్‌, సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు హ‌బీబ్‌, కాంటెస్టెడ్ కార్పొరేట‌ర్లు ఇలియాస్ ష‌రీఫ్‌, శ్రీనివాస్‌, జ‌హంగీర్ నాయ‌కులు వైఎం తిరుప‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద శానిటైజేష‌న్ చేస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here