న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పితృ దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని చందానగర్ డివిజన్ పరిదిలోని సురక్ష హిల్స్ లో గల అమ్మ-నాన్న వృద్ధాశ్రమంలో పితృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులైన మాతా పితలకు భోజన సదుపాయం ఏర్పాటు చేయటంతో పాటు నిత్యావసర వస్తువులు బిస్కెట్లు, బాత్ సోప్స్, వాషింగ్ సోప్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, షాంపూ మరియు అరటి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యురాలు వాణి, గంగాధర్, తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మించిన దైవం లేదని, ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది అమ్మ అయితే ఆ ప్రపంచాన్ని పరిచయం చేసింది నాన్న అని చెప్పారు. తండ్రి తన పిల్లల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమించే శ్రమజీవి అన్నారు. తండ్రి పైకి గంభీరంగా కనిపించినా తండ్రి కి తన పిల్లలపై ప్రేమ ఉంటుందన్నారు. నేటి యువత స్వార్థ చింతనతో జన్మనిచ్చిన తల్లి తండ్రులను నిర్లక్ష్యంచేస్తున్నారని, వారిని కంటి రెప్పలా చూసుకోవాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భవానీ శంకర్, జనార్దన్, ఆశ్రమ నిర్వాహకులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో భోజనం అందజేస్తున్న న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here