శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా MCT ఆధ్వర్యంలో, జ్యోతి ఫార్మసీ, లక్ష్మి ఫార్మసీ సౌజన్యంతో శేరిలింగంపల్లి నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద నివసించే వివిధ రాష్ట్రాల పేద ప్రజలు, రోజువారి కూలీలకు, వారి పిల్లలకు ఉచితంగా పండ్లు, బిస్కెట్ ప్యాకెట్స్, ఓఆర్ఎస్ పాకెట్స్, జలుబు, దగ్గు, జ్వరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TRPS, RMP, PMP, CP, EP వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డావెంకట్ రెడ్డి, వైద్యులు డా. బాలకృష్ణ, డా. శివశంకర్, డా. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.