మ‌ల‌బార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో వ‌జ్రాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌న

శేరిలింగంపల్లి, జూలై 19 (న‌మస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ షో పేరిట బ్రాండెడ్ జ్యువలరీ ఆభరణాల ప్రదర్శనను నిర్వ‌హించారు. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శించారు. ఈ ఆభరణాలను అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవని, నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తాయ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు ఈ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతుంద‌న్నారు. ఇందులో భాగంగా మ‌గువ‌లు ఇష్ట‌ప‌డే ఆభ‌ర‌ణాల‌ను త‌యారు చేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌తి కొనుగోలుపై ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు వివరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here