శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావుని తర్నాకలోని ఆయన నివాసంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్.రామచందర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరింతగా బలోపేతమై రానున్న ప్రతీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ నాయకుడు సత్యనారాయణ రాజు , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.